Pages

Sunday 4 May 2014

భగత్‌సింగ్ నిర్దోషే?

భగత్‌సింగ్ నిర్దోషే?

Sakshi | Updated: May 05, 2014 01:29 (IST)
లాహోర్: బ్రిటిష్ అధికారి హత్య కేసులో భారత స్వాతం త్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ నిర్దోషిత్వాన్ని నిరూపించే ఓ ఆధారం బయటకొచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో భగత్‌సింగ్ పేరు లేదని వెల్లడైంది. 1928లో బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి సాండర్స్ హత్యకు గురికాగా, ఈ కేసులో భగత్‌సింగ్‌ను 1931లో లాహోర్‌లోని షాద్‌మాన్ చౌక్‌లో ఉరితీశారు. ఈ కేసు ఎఫ్‌ఐఆర్ కాపీని భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ రషీద్‌ఖురేషీ కోర్టు ద్వారా సంపాదించారు.

సాండర్స్ హత్యపై లాహోర్‌లోని అనార్కలి పోలీస్ స్టేషన్‌లో 1928 డిసెంబర్ 17న గుర్తు తెలియని ఇద్దరు సాయుధులపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తేలింది. ఈ కేసును తిరిగి తెరవాలని కోరుతూ ఖురేషీ ఇప్పటికే లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Friday 2 May 2014

ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్

ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్



Sakshi | Updated: May 03, 2014 08:10 (IST)
ప్రపంచ సెక్సీయెస్ట్ మహిళ జెన్నీఫర్ లారెన్స్
లాస్ ఎంజెల్స్: పురుషులకు చెందిన ఎఫ్‌హెచ్‌ఎం పత్రిక ఈ ఏడాది సెక్సీయెస్ట్ మహిళగా ఆస్కార్ అవార్డు గెలిచిన నటి జెన్నిఫర్ లారెన్స్‌ను ఎంపిక చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆ పత్రిక 2014 టాప్ 100 హాటెస్ట్ గర్ల్స్ జాబితాను విడుదల చేయగా.. అందులో ప్రథమ స్థానాన్ని ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ నటి జెన్నిఫర్ దక్కించుకుంది.
తనకు ఈ కిరీటం దక్కడంపై జెన్నిఫర్ ఆనందం వ్యక్తం చేసింది. సెక్సీ అంటే భారీ మేకప్, కచ్చితమైన శరీరాకృతి, జుట్టు కాదని, అది ఆత్మవిశ్వాసమని చెప్పింది. నీకులా నువ్వు సౌకర్యంగా ఉండడం, ఎల్లప్పుడూ దరహాసం, సంతోషమే సెక్సీ అని తెలిపింది.  కాగా, రెండో స్థానాన్ని ఇంగ్లిష్ నటి మిషెల్లీ కీగన్ దక్కించుకున్నారు.